ఏపి ప్రభుత్వానికి మరోసారి ఎదరుదెబ్బ

గవర్నర్ కు ఈ దశలో సూచనలు ఇవ్వలేమన్న సుప్రీం

nimmagadda-ramesh kumar-supreme-court

న్యూఢిల్లీ: నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ కేసులో మరోసారి ఏపి ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పునర్నియామకంపై స్టే ఇవ్వలేమంటూ సుప్రీంకోర్టు నిరాకరించింది. మధ్యంతర ఆదేశాలు ఇవ్వడం కుదరదని స్పష్టం చేసింది. అటు, ఎన్నికల నిర్వహణపైనా మాట్లాడదలుచుకోలేదని చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే స్పష్టం చేశారు. విచారణ సందర్భంగా ఏపి ప్రభుత్వం తరఫున సీనియర్ అడ్వొకేట్ రాకేశ్ ద్వివేది వాదనలు వినిపించారు. హైకోర్టు ఉత్తర్వుల కారణంగా గతంలోని అధికారులు కూడా పనిచేయలేకపోతున్నారని వివరించారు. మధ్యంతర ఎస్ఈసీని నియమించేలా గవర్నర్ కు సూచించాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. అయితే ఏపి ప్రభుత్వ న్యాయవాది సూచనలను న్యాయస్థానం తిరస్కరించింది. గవర్నర్ కు ఈ దశలో సూచన చేయలేమని చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే తేల్చి చెప్పారు. మరో మూడు వారాల తర్వాత తుది వాదనలు వింటామంటూ తదుపరి విచారణను ఆ మేరకు వాయిదా వేశారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/