కరోనా కేసుల సంఖ్య 2,93,923

మృతుల సంఖ్య 1,594

Corona cases updates
Corona cases updates

Hyderabad: తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. రాష్ట్ర ఆరోగ్య శాఖ కొద్ది సేపటి కిందట విడుదల చేసిన బులిటెన్ మేరకు గత 24 గంటల్లో అంటే మొన్న రాత్రి 8 గంటల నుంచి నిన్న రాత్రి 8 గంటల వరకూ తెలంగాణలో కొత్తగా 186 మంది కరోనా బారిన పడ్డారు.

అదే సమయంలో ఒకరు కరోనా కాటుకు బలయ్యారు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2,93,923కి చేరింది. కరోనా మృతుల సంఖ్య 1,594కి పెరిగింది.

తాజా కెరీర్‌ సమాచారం కోసం :https://www.vaartha.com/specials/career/