అమెరికాలో మళ్లీ కాల్పులు కలకలం

దుండగుడు సహా నలుగురు మృతి

4 people, including gunman, dead in Indiana mall shooting

వాషింగ్టన్ః మళ్లీ అమెరికాలో కాల్పులు ఘటన చోటుచేసుకుంది. ఇండియానా స్టేట్‌లోని ఓ మాల్‌లో దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో ముగ్గురు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం సాయంత్రం ఇండియానాలోని గ్రీన్‌ఉడ్‌ పార్క్‌ మాల్‌లో ఉన్న ఫుడ్‌కోర్టులోకి చొరబడిన ఓ వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారని పోలీసులు తెలిపారు. గాయపడినవారిని దవాఖానకు తరలించామని వెల్లడించారు. కాగా, ఓ పౌరుడు జరిపిన కాల్పుల్లో దుండగుడు హతమయ్యాడని చెప్పారు.

కాగా, అమెరికాలో కాల్పుల ఘటనలు చోటుచేసుకోవడం సర్వ సాధారణమైంది. ఏడాది కాలంలో సుమారు 40 వేల మందికిపైగా తుపాకీ కాల్పుల్లో మృతిచెందారని అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ నెల 4న చికాగో సబ్‌అర్బ్‌లో జరిగిన కాల్పుల్లో ఏడుగురు మరణించిన విషయం తెలిసిందే. ఇదే ఘటనలో మరో రెండు డజన్ల మంది గాయపడ్డారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/movies/