నేడు సర్పంచ్‌లతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌

ఈరోజు పంచాయతీ రాజ్‌ దినోత్సవం సందర్భంగా సర్పంచ్‌లను మోడి సందేశం

narendra modi
narendra modi

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి కరోనా నేపథ్యంలో ఈరోజు దేశంలోని సర్పంచ్‌లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడనున్నారు. దేశంలో కరోనా విజృంభణతో పాటు ఈ రోజు పంచాయతీ రాజ్‌ దినోత్సవం పురస్కరించుకుని ప్రధాని ఈనిర్ణయం తీసుకున్నారు. ‘ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రధాని మోడి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా దేశంలోని సర్పంచ్‌లతో మాట్లాడతారు. అందరు సర్పంచ్‌లు దూరదర్శన్‌ ద్వారా ఈ సంభాషణను, సామాజిక దూరాన్ని పాటిస్తూ తమ ఇంట్లో నుంచే చూడవచ్చు. మోడితో మాట్లాడి తమ అభిప్రాయాలను పంచుకోవాలనుకున్న వారు దగ్గరలోని కామన్‌ సర్వీస్‌ సెంటర్‌కు వెళ్లి మోడితో మాట్లాడొచ్చు’ అని ప్రధాన మంత్రి కార్యాలయం ప్రకటించింది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/