ఏపి పోలీస్‌శాఖ సాంకేతికత బృందం భేష్
అభినందించిన డిజిపి గౌతం సవాంగ్

అమరావతి: రాష్ట్రంలోని పోలీస్ సాంకేతిక శాఖ బృందాన్ని డిజిపి గౌతం సవాంగ అభినందించారు. విదేశాల నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన వారి కదలికలను గుర్తించేందుకు వారిని జియో ఫిన్సింగ్ టెక్నాలజితో అనుసంధానం చేశారు. ఈ టెక్నాలజి ద్వారా రాష్ట్రంలోకి విదేశాల నుంచి వచ్చిన వారి కదలికలను గురిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారు కఛ్చితంగా హోం క్వారంటైన్లో ఉండాలి కాబట్టి వారు ఈ నిబందనలను పాటిస్తున్నార లేదా అనేది ఈ జియో ఫెన్సింగ్ ద్వారా పోలీసులు గమనిస్తున్నారు. విదేశాల నుంచి రాష్ట్రానికి 22,478 మంది రాగా. అందరిని ఈ జియో ఫెన్సింగ్ ద్వారా అనుసంధానం చేశారు. వీరిలో 3,043 మంది నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా వారిపై కేసులు నమోదు చేశామని డిజిపి గౌతం సవాంగ్ తెలిపారు. నిన్నటి వరకు ఇరవై ఎనిమిది రోజులు హోం క్వారంటైన్ పూర్తి చేసుకోవడంతో వారిపైన ఉన్న ప్రత్యేక ఆంక్షలను తొలగించినట్లు చెప్పారు. సాధారణ ప్రజలతో కలిసి తిరిగేందుకు వెసులుబాటు కల్పిస్తున్నట్లు చెప్పారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/