అమెరికాలో నిరసనలకు ట్రంప్‌ చిన్నకూతురు మద్దతు

Trump’s daughter Tiffany protests George Floyd’s killing on

వాషింగ్టన్‌: అమెరికాలో నల్లజాతీయుడు‌ జార్జి ఫ్లాయిడ్‌ మృతికి నిరసనగా ఆ దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు, హింస చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై ట్రంప్ చిన్న కూతురు టిఫాని ట్రంప్ మాత్రం‌ ఆ నిరసనలకు మద్దతు తెలిపి తన తండ్రికి షాక్‌ ఇచ్చారు. నిరసనకు గుర్తుగా, మద్దతుగా నలుపురంగును తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు. ఒంటరిగా పోరాడితే ఫలితం అంతగా ఉండదని, అందరూ కలిసి నడిస్తే చాలా సాధించవచ్చన్న హెలెన్‌ కెల్లర్‌ వ్యాఖ్యలను ఆమె క్యాప్షన్‌గా రాయడం గమనార్హం. ఆమె ఈ విధంగా మద్దతు పలకడం పట్ల సామాజిక మాధ్యమాల్లో ఆమెపై ప్రశంసల జల్లుకురుస్తోంది. అంతేకాదు, టిఫాని ట్రంప్‌ తల్లి కూడా నిరసనలకు మద్దతు పలికారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/