గాడ్ ఫాదర్ నుండి నయనతార ఫస్ట్ లుక్ రిలీజ్

గాడ్ ఫాదర్ నుండి నయనతార ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసారు మేకర్స్. మెగాస్టార్ చిరంజీవి – మోహన్ రాజా కలయికలో గాడ్ ఫాదర్ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన ‘లూసిఫర్’ రీమెక్ ను తెలుగులో ‘గాడ్ ఫాదర్’గా రాబోతుంది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ఈ సినిమాను తెరకెక్కిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం నుండి హీరోయిన్ నయనతార తాలూకా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసి అభిమానులను అలరింపజేశారు.

‘సత్య ప్రియ జయదేవ్’ ​అనే పాత్రలో నయనతార నటించనున్నారని పోస్టర్ ద్వారా తెలిపారు. ఈ పోస్టర్​లో సంప్రదాయబద్దమైన కాటన్​ చీరలో నయన్​ కనిపించారు. టైప్​ రైటర్​పై ఏదో రాస్తునట్లుగా ఉన్న ఆ పోస్టర్​ను చూసిన అభిమానులు ఈ పాత్రకు నయన్​ కరెక్ట్​ ఛాయిస్​ అని కామెంట్లు పెడుతున్నారు. ఇక రీసెంట్ గా నయనతార ..దర్శకుడు విఘ్నేశ్​ శివన్​ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లైన తర్వాత ఆమె నటించనున్న ప్రాజెక్టుల్లో గాడ్​ ఫాదర్​ ఒకటి. ఈ మాస్​ ఎంటటైనర్​ మూవీలో కండల వీరుడు సల్మాన్ ఖాన్ , దర్శకుడు పూరీ జగన్నాథ్​, నటుడు సత్యదేవ్​ సైతం ప్రత్యేక పాత్రలలో నటిస్తున్నారు.