తెలంగాణాలో పెండింగ్ ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్

Congress

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ లో పెండింగ్ లో ఉన్న ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ లోక్ సభ స్థానాలకు సంబదించిన అభ్యర్థులను పెండింగ్ లో పెట్టడం తో అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమ్మలో బుధువారం సాయంత్రం ఈ మూడుస్థానాలకు సంబదించిన అభ్యర్థులను ప్రకటించి హమ్మయ్య అనిపించింది.

ఖమ్మం నుంచి రామసహాయం రఘురాంరెడ్డి, కరీంనగర్ నుంచి వెలిచాల రాజేందర్ రావు, హైదరాబాద్ నుంచి మహమ్మద్ సమీర్‌లను బరిలోకి దింపుతోంది. ఈ తరుణంలో ఈరోజు రఘురామిరెడ్డి భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొంగులేటి, ఎంపీ రేణుక చౌదరి హాజరుకానున్నారు.