చేవెళ్ల ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి సాహితి

ఇటీవల సినీ తారలు సైతం రాజకీయాల్లో రాణించాలని ఎంతో ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ తారలు రాజకీయాల్లో రాణిస్తుండగా..మరికొందరు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ తరుణంలో ఈ సార్వత్రిక ఎన్నికల్లో మరో సినీనటి పోటీకి సై అంటుంటుంది. త్వరలో తెలంగాణ లో జరగనున్న లోక్ సభ ఎన్నికల బరిలో ‘పొలిమేర’ సిరీస్ చిత్రాలతో ప్రేక్షకాదరణ పొందిన నటి దాసరి సాహితి బరిలోకి దిగబోతుంది. చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ మేరకు బుధవారం ఆమె నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్‌ శశాంక్‌కు నామినేషన్ పత్రాలు అందజేశారు.

పొలిమేర, పొలిమేర-2 చిత్రాలతో సాహితి నటన సినీప్రేక్షకలను మెప్పించింది. తొలి భాగంలో గెటప్‌ శ్రీను భార్య రాములు పాత్రలో నటించిన ఆమె సీక్వెల్‌లో రాజేశ్‌తో కలిసి నటించారు. ఇక చేవెళ్ల నుంచి బీజేపీ నేత కొండావిశ్వేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ తరపున రంజిత్ రెడ్డి పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ తరపున కాసాని జ్ఞానేశ్వర్ బరిలో నిలిచారు. ఇప్పుడు వారితో పాటు ఈమె కూడా బరిలోకి దిగబోతుంది.