వాలంటీర్ల కాళ్లు పట్టుకుని పవన్‌ క్షమాపణ కోరాలి – రోజా

వాలంటీర్ల వ్యవస్థ మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి రోజా ఫైర్ అయ్యారు. స్వాతంత్య్రం వచ్చాక ఇంత గొప్పగా.. పారదర్శక పాలన అందించిన వ్యవస్థ(వాలంటీర్‌ వ్యవస్థను ఉద్దేశించి..) ఇంకోటి లేదు. కేంద్రం, ఇతర రాష్ట్రాలు సైతం వాలంటీర్‌ వ్యవస్థను మెచ్చుకుంటూ , ఆదర్శంగా తీసుకుంటున్నాయి. అలాంటి వ్యవస్థ గురించి పవన్ కళ్యాణ్ చులకనగా మాట్లాడడం దారుణం. వాలంటీర్ల కాళ్లు పట్టుకుని పవన్‌ క్షమాపణ కోరాలి. చంద్రబాబు గతంలో వలంటీర్ వ్యవస్థ పై నోటికొచ్చినట్టు మాట్లాడాడు. ఇప్పుడు దత్త పుత్రుడు విషం చిమ్ముతున్నాడు దమ్ముంటే ఒకటో తేదీన వస్తే.. వాలంటీర్లు ఎలాంటి వాళ్లో తెలుస్తుందని సవాల్‌ విసిరారు. కరోనా సమయంలో ప్రాణ భయంతో పవన్ కల్యాణ్, చంద్రబాబు హైదరాబాద్ వెళ్లి దాక్కున్నారని.. ప్రభుత్వంతో కలిసి వాలంటీర్లు నిస్వార్థ్యంగా సేవలందించారని గుర్తు చేసారు రోజా

ఇన్నాళ్లు జ‌గ‌న్‌ను చూస్తే ప‌వ‌న్‌, చంద్ర‌బాబుకు వ‌ణుకు అనుకున్నాను, జ‌గ‌న‌న్న తీసుకువ‌చ్చిన వాలంటీర్ల‌ను చూసి కూడా వ‌ణికిపోతున్నార‌ని మంత్రి రోజా ఎద్దేవా చేశారు. ఎన్‌సీఆర్‌బీ గణాంకాల ప్రకారం.. మహిళల మిస్సింగ్‌ కేసుల్లో టాప్‌ టెన్‌లో ఏపీ లేనే లేదు. ఎవరూ సంతోషంగా ఉండకూడదనే దరిద్రపు గొట్టు ఆలోచనతో పవన్‌ ఉన్నాడు. అసలు ఆ లిస్ట్‌లో తెలంగాణ 6వ స్థానంలో ఉంది కదా. మరి ఆ రాష్ట్రం గురించి మాట్లాడవేం అని పవన్ కల్యాణ్‌ను నిలదీశారు. కేసీఆర్‌కు భయపడే మాట్లాడలేకపోతున్నాడని అన్నారు.

తన తల్లిని తిట్టినవాళ్లను గెలిపించమని పవన్‌ ప్రాధేయపడుతున్నారు. మీ అమ్మా.. భార్యను తిట్టింది టీడీపీ వాళ్లు కాదా?. తల్లిని చంద్రబాబు, లోకేష్ తిట్టారని 2018 లో నువ్వు ట్వీట్ చెయ్యలేదా..? అని ప్రశ్నించారు. నీ కార్యకర్తలను సంకరజాతి వాళ్ళు అని బాలకృష్ణ తిడితే.. ఆయనకే ఇంటర్వ్యూ ఇస్తావా..?. మహిళల అక్రమ రవాణా జరిగింది చంద్రబాబు హయాంలోనే. ఆ టైంలో జరిగిన కాల్‌ మనీ సెక్స్‌ రాకెట్‌పై అసలు ఎందుకు పెదవి విప్పలేదని పవన్‌ను సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు ఓటమి భయం పట్టుకుందని, అందుకే జగనన్న ప్రభుత్వంపై తప్పుడు విమర్శలు చేస్తున్నారని మంత్రి రోజా అన్నారు.