జై బాలయ్య సాంగ్ వచ్చేసింది

‘వీర సింహ రెడ్డి’ నుండి జై బాలయ్య సాంగ్ వచ్చేసింది. థమన్ మ్యూజిక్ అందించిన ఈ సాంగ్ దుమ్ములేపుతుంది. బాలకృష్ణ – శృతిహాసన్ జంటగా క్రాక్ ఫేమ్ గోపీచంద్ మలినేని డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీ ‘వీర సింహ రెడ్డి’ . మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో సినిమాలోని జై బాలయ్య సాంగ్ ను శుక్రవారం మేకర్స్ విడుదల చేసారు.

‘రాజసం నీ ఇంటి పేరు.. పౌరుషం నీ ఒంటి పేరు.. నిన్ను తలచుకున్న వారు.. లేచి నిల్చొని మొక్కుతారు.. అచ్చ తెలుగు పౌరషాల రూపం నువ్వయ్యా.. అలనాటి మేటి రాయలోరి తేజం నువ్వయ్యా..’ అంటూ సాగిన ఈ సాంగ్ కు లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా, సింగర్ కరీముల్లా హుషారుగా ఈ గీతాన్ని ఆలపించారు. ఈ పాటకు శంకర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసారు. జన సమూహాల మధ్య దేవాలయాల పరిశరాలలో ఈ పాటని చిత్రీకరించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని – వై రవిశంకర్ లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.