నేడు విజయవాడలో పర్యటించనున్న సీఎం జగన్‌

ఏపీ సీఎం జగన్..నేడు విజయవాడ లో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి విజయవాడ వెళ్లనున్నారు. అనంతరం విజయవాడ రాఘవయ్య పార్కు సమీపంలోని మిషనరీస్‌ ఆఫ్‌ ఛారిటీ నిర్మల్‌ హృదయ్‌ భవన్‌ను సందర్శించనున్నారు. ఆ తర్వాత 10.10 గంటల నుంచి 10.40 వరకు పిల్లలతో ముచ్చటించనున్న సీఎం అనంతరం తాడేపల్లికి తిరిగి చేరుకోనున్నారు.

అలాగే జూన్ 02 న జగన్ గుంటూరు లో పర్యటించనున్నారు. దీనికి సంబదించిన షెడ్యూల్ కూడా ఖరారైంది. వైయస్సార్ యంత్ర సేవా పథకం రెండో మెగామేళా నిర్వహణలో పాల్గొన్నారు. ఈ మేళాలో భాగంగా 793 ట్రాక్టర్లు, 38 హార్వెస్టర్లను రైతులకు అందించనున్నారు. ఈ వేదిక ద్వారా గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్, బాపట్ల, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణ, ప్రకాశం జిల్లాల రైతులకు ట్రాక్టర్లు పంపిణీ చేస్తారు.