కరోనాతో విదేశాల్లో 40మంది భారతీయులు మృతి

50కి పైగా దేశాల్లో 6,300 మంది భారతీయులకు కరోనా

 people
people

న్యూఢిల్లీ: ప్రపంచ దేశాల్ని కరోనా భూతం పట్టి పీడిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులు సైతం కరోనా భారిన పడి మృత్యువాత పడుతున్నారు. ఇప్పటికే యాబైకి పైగా దేశాల్లో సుమారు 6,300 మంది భారతీయులు కరోనా భారిన పడ్డారు. ఇప్పటి వరకు విదేశాలో కరోనా సోకి 40 మంది భారతీయులు చనిపోయినట్లు గుర్తించారు. కాగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచ దేశాలు రవాణా వ్యవస్థను నిలిపి వేయడంతో విదేశాలో ఉన్న వారు స్వదేశానికి రావడానికి కుదరడంలేదు. భారత్‌లో కూడా విదేశాలనుంచి వచ్చిన వారివల్లే కరోనా వ్యాప్తి మొదలవడంతో భారత ప్రభుత్వం విదేశాల్లో ఉన్న వారిని రావద్దని సూచించింది. లాక్‌డౌన్‌ విదించిన కారణంగా ఎక్కడి వారు అక్కడే ఉండాలని సూచించింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/