నేడు జగనన్న దీవెన పథకం ప్రారంభించనున్న సిఎం

cm jagan
cm jagan

అమరావతి: ఏపి సిఎం జగన్‌ నేడు విజయనగరం జిల్లాలో పర్యటించబోతున్నారు. ఈనేపథ్యంలో ఆయన జగనన్న దీవెన పథకం ప్రాంరభించనున్నారు. అందువల్ల వైఎస్‌ఆర్‌సిపి ఈ పర్యటనపై ఎంతో ఆసక్తిగా ఉన్నాయి. ఇందుకు సంబంధించి ప్రభుత్వం టూర్ షెడ్యూల్ ఫైనలైజ్ చేసింది. సిఎం జగన్… ఉదయం 9.10 నుంచీ గుంటూరు… తాడేపల్లిలోని తన ఇంటి నుంచీ బయల్దేరతారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కి వెళ్తారు. అక్కడి నుంచీ విశాఖ ఎయిర్‌పోర్ట్ చేరుకుంటారు. అక్కడి నుంచీ హెలికాప్టర్‌లో విజయనగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌కి వెళ్లి ఉదయం 11 గంటలకి మైదానంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభకు వెళ్తారు. ముందుగా అక్కడి ఎగ్జిబిషన్ స్టాళ్లను చూస్తారు. తర్వాత వైఎస్ఆర్ జగనన్న దీవెన పథకాన్ని ప్రారంభిస్తారు. పథకం గురించి ప్రజలకు వివరిస్తారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/