మరో రెండు గంటల్లో భారత్కు ట్రంప్ రాక
గుజరాత్లో ముందుగా పర్యటించనున్న ట్రంప్

న్యూఢిల్లీ: నేడు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్కు రానున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రధాని మోడి సొంత రాష్ట్రం గుజరాత్లో ముందుగా ట్రంప్ పర్యటించనున్నారు. అక్కడ అహ్మాదాబాద్లో నమస్తే ట్రంప్ కార్యక్రమంలతో పాల్గొంటారు. ర్యాలీలో కూడా పాల్గొనననున్నారు. ఈ సందర్భంగా అహ్మాదాబాద్లో కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటను చోటుచేసుకోకుండా భద్రత పెంచారు. సబర్మతి ఆశ్రమాన్ని కూడా ట్రంప్ సందర్శించనున్నారు. దీంతో సబర్మతి ఆశ్రమం వద్ద కూడా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆశ్రమం వద్ద యూఎస్ సెక్యూరిటీకి చెందిన స్నిఫర్ డాగ్స్ భద్రతలో ఉన్నాయి. సబర్మతి ఆశ్రమానికి ట్రంప్ దంపతులు సందర్శించనున్నారు. అహ్మదాబాద్ ఎయిర్పోర్టు నుంచి మోతెరా స్టేడియం వరకు మొత్తం 16 చోట్ల తాగునీటి సరఫరాకు ఏర్పాట్లు చేశారు. ప్రతి తాగునీటి సరఫరా కేంద్రం వద్ద ముగ్గురు సిబ్బందిని ఉంచింది. నమస్తే ట్రంప్ ఈవెంట్లో పాల్గొనేందుకు వచ్చే ప్రజలకు తాగునీటిని సరఫరా చేయనున్నారు .
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/