రాహుల్ ఫై కేటీఆర్ చేసిన కామెంట్స్ కు రేవంత్ కౌంటర్

revanth reddy counter to ktr

కేసీఆర్ జాతీయ రాజకీయాల ఫై రాహుల్ చేసిన కామెంట్స్ కు మంత్రి కేటీఆర్ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ‘రాహుల్ గాంధీ త‌న స్వంత పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అమేథీలోనే గెలువలేకపోయారు.. అలాంటి వ్యక్తి జాతీయ పార్టీ ఆశ‌యాల‌తో ముందుకు వెళ్తున్న సీఎం కేసీఆర్‌ను విమ‌ర్శించే హ‌క్కు లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్ర‌ధాన‌మంత్రి కావాలనుకుంటున్న రాహుల్ గాంధీ.. ముందుగా ప్ర‌జ‌ల్ని ఒప్పించి స్వంత నియోజ‌క‌వ‌ర్గంలో ఎంపీగా గెల‌వాల‌ని కేటీఆర్ సెటైర్ వేశారు. ఈ సెటైర్లకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.

మీరు డబ్బా కొట్టుకుంటున్న ‘జాతీయ’ నాయకుడి రాజకీయ జీవితం ఓటమితోనే మొదలైందన్న సంగతి గుర్తుందా…? అని ప్రశ్నించారు. కన్నకూతురినే ఎంపీగా గెలిపించుకోలేకపోయాడని ఎద్దేవా చేశారు. ఎవరన్నా గుర్తు చేయండ్రా బాబూ… అంటూ రేవంత్ రెడ్డి వ్యంగ్యం ప్రదర్శించారు. ‘డ్రామారావు’ అనే హ్యాష్ ట్యాగ్ తో కేటీఆర్ ట్వీట్ పై ఈ మేరకు స్పందించారు.