ప్రభుత్వ ఆసుపత్రిలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన కలెక్టర్ స్నేహలత

ప్రభుత్వ ఆసుపత్రిలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన కలెక్టర్ స్నేహలత

ప్రభుత్వ ఆసుపత్రి అంటే ఆమ్మో ..అని అంత అనుకుంటారు..అక్కడికి పోతే డాక్టర్స్ ఉంటారో ఉండరో..సరిగా వైద్యం చేస్తారో లేదో..అని చాలామంది పోతే పోయిని డబ్బులని ప్రవైట్ హాస్పటల్స్ కు వెళ్తుంటారు. ఇలాంటి తరుణంలో ప్రభుత్వ ఆసుపత్రి లో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చి అందరికి ఆదర్శం అయ్యారు ఖమ్మం జిల్లా అడిషనల్ కలెక్టర్ స్నేహలత.

స్నేహలత కు పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లకుండా సామాన్య మహిళలా ప్రభుత్వాసుపత్రికి వచ్చి టెస్టులు చేయించుకుంది. ఆ తర్వాత స్నేహలతకు అక్కడే డెలివరీ చేశారు. పూర్తి ఆరోగ్యంతో కలెక్టర్ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇక ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుంది. దాంతో కలెక్టరమ్మ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్‌ బీ మాలతి, ప్రభుత్వ దవాఖాన మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ బీ వెంకటేశ్వర్లు, ఆర్‌ఎంవో డాక్టర్‌ బీ శ్రీనివాసరావు వైద్య సేవలను పర్యవేక్షించారు. అదనపు కలెక్టర్‌ హోదాలో ఉన్నప్పటికీ సర్కా రు దవాఖానలో డెలివరీ చేయించుకొని ప్రజలకు ఆదర్శంగా నిలిచారం టూ ప్రతిఒక్కరూ కొనియాడుతున్నా రు.