పొంచి ఉన్న మరో అల్పపీడనం!
నేడు, రేపు వర్షాలు కురిసే అవకాశం : హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి

Hyderabad: ఈనెల 19న మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి తూర్పు మధ్య అరేబియా సముద్రం వెంట ఉత్తర కోస్తాంధ్ర, తెలంగాణ, దక్షిణ మహారాష్ట్ర, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ కొంకన్ ప్రాంతాల్లో ఉపరితల ద్రోణి కొనసాగుతున్నది.
ఈ ప్రభావంతో రాష్ట్రంలోని పలుచోట్ల నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది.
తాజా ఎన్నారై వార్తల కోసం : https://www.vaartha.com/news/nri/