పార్టీ జిల్లా అధ్యక్షులు, కోర్ఢినేటర్లు, అబ్జర్వర్లతో సిఎం జగన్ భేటీ

ap-cm-jagan

అమరావతిః వైఎస్‌ఆర్‌సిపిజిల్లా అధ్యక్షులు, కోఆర్డినేటర్లు, అబ్జర్వర్లతో ఆ పార్టీ అధినేత, సిఎం జగన్ కీలక భేటీ నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి 50 మంది ఓటర్లకు పార్టీలో పని చేస్తున్న ఇద్దరిని వాలంటీర్లుగా నియమించాలని ఆయన భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న వాలంటీర్ వ్యవస్థ, వాలంటీర్లపై పూర్తిగా ఆధారపడలేమనే అభిప్రాయాలు వెల్లడవుతున్న నేపథ్యంలో జగన్ ఈ మేరకు నిర్ణయించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో జగన్ కీలక భేటీని నిర్వహించబోతున్నారు. ఇదే సమావేశంలో నియోజకవర్గాల వారీగా ఐప్యాక్ అందించిన నివేదికపై కూడా చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నివేదిక ఆధారంగా మార్పులు, చేర్పులపై పార్టీ శ్రేణులకు పలు సూచనలు చేయనున్నారు. గడపగడపకు కార్యక్రమంపై రిపోర్టును పార్టీ శ్రేణుల ముందు ఉంచి, వారికి సూచనలు చేయనున్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/business/