కాంగ్రెస్ హిమాచల్ ప్రజలకు అత్యుత్తమ పాలనను అందజేస్తుందిః రేవంత్ రెడ్డి

Rewanth Reddy

హైదరాబాద్ః హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన విజయం సాధించిందని సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు, కాంగ్రెస్ నాయకులకు రేవంత్ రెడ్డి ట్విట్టర్ లో అభినందనలు తెలిపారు.

అద్భుతమైన విజయం కోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు చాలా బాగా కృషి చేశారని రేవంత్ రెడ్డి కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు అత్యుత్తమ పాలనను అందజేస్తుందని అన్నారు. ప్రజల జీవితాల అభివృద్ధికి కృషి చేస్తుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/business/