హిమాచ‌ల్‌లో కాంగ్రెస్ విజ‌యం పై స్పందించిన ఖర్గే

రాహుల్ జోడో యాత్ర ప్ర‌భావంతోనే హిమాచ‌ల్ కాంగ్రెస్ ఘ‌న విజ‌యం.. మల్లికార్జున ఖర్గే

congress-chief-mallikarjun-kharge-says-bharat-jodo-yatra-helped-in-himachal-polls

న్యూఢిల్లీః హిమాచ‌ల్ ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో కాంగ్రెస్ దూసుకుపోతోంది. 68 స్దానాలు క‌లిగిన హిమాచ‌ల్‌లో ప్ర‌భుత్వ ఏర్పాటుకు మేజిక్ ఫిగ‌ర్‌కు 35 మంది ఎమ్మెల్యేలు గెలుపొందాల్సి ఉండగా, కాంగ్రెస్ 40 స్ధానాల‌ను గెలుచుకునే దిశ‌గా ముందుకు సాగుతోంది. బిజెపి 26 స్ధానాల్లో ఆధిక్యం క‌న‌బ‌రుస్తుండ‌గా ఇత‌రులు మూడు స్ధానాల‌ను గెలుచుకోనున్నారు. ఇక హిమాచ‌ల్‌లో ప్ర‌భుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ స‌న్న‌ద్ధమైంది. హిల్ స్టేట్‌లో స్ప‌ష్ట‌మైన మెజారిటీ సాధించ‌నుండ‌టంతో కాంగ్రెస్ నేత‌ల్లో జోష్ నెల‌కొంది.

రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర ప్ర‌భావంతోనే హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో కాంగ్రెస్ ఘ‌న విజ‌యం సాధించింద‌ని ఆ పార్టీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే అన్నారు. రాహుల్ ప్ర‌భావంతో పాటు ప్రియాంక గాంధీ ప్ర‌చారం, ప‌ర్య‌వేక్ష‌ణ‌, నాయ‌కుల స‌మిష్టి కృషితో బిజెపిని మ‌ట్టిక‌రిపించామ‌ని ఆ పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/business/