ఢిల్లీలో ప్ర‌భుత్వ, ప్రైవేటు స్కూళ్లు మూసివేత

న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఢిల్లీలో స్కూళ్ల‌ను త‌దుప‌రి ఆదేశాలు ఇచ్చే వ‌ర‌కు మూసివేస్తున్న‌ట్లు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి మ‌నీష్ శిసోడియా తెలిపారు. రెగ్యుల‌ర్‌గా క్లాసులు నిర్వ‌హించేందుకు విద్యార్థులు త‌ల్లితండ్రులు ఆస‌క్తిగా లేర‌ని ఆయ‌న వెల్ల‌డించారు. ప్ర‌భుత్వ, ప్రైవేటు స్కూళ్ల‌ను మూసివేయ‌నున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. దేశ‌రాజ‌ధానిలో మ‌ళ్లీ కోవిడ్ కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. కాగా ఐపీ యూనివ‌ర్సిటీ కింద ఉన్న కాలేజీల్లో సీట్ల సంఖ్య 1330కి పెంచిన‌ట్లు మంత్రి శిసోడియా తెలిపారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/