కొవిడ్‌పై నేడు సీఎం జగన్ సమీక్ష

అమరావతి : ఈరోజు ఉదయం 11 గంటలకు సీఎం కొవిడ్‌పై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో ఇంకా కొనసాగుతున్న కర్ఫ్యూ ఆంక్షలపై చర్చించే అవకాశం ఉంది. ఈ నెల 8 నుండి రాత్రి కర్ఫ్యూ మాత్రమే కొనసాగించాలని ఈ సమావేశంలొ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పగటి పూట కర్ఫ్యూ అమలులో ఉన్న జిల్లాల్లో కూడా పాజిటివిటీ రేటు తగ్గుతుండడంతో సడలింపుపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, సంబంధిత శాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/