అరే..కత్తెర ఏదయా? .. కేసీఆర్ తీవ్ర అసహనం
చేతితో రిబ్బన్‌ను పీకి పడేసిన సీఎం

Sirisilla: సిరిసిల్ల పర్యటనలో అధికారుల తీరుపై సీఎం కేసీఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆదివారం సిరిసిల్లలో జరిగిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం పాల్గొన్న సంగతి తెలిసిందే. .. అయితే ఒక ఇంటి గృహ ప్రవేశానికి అంతా రెడీ అయ్యారు. వేదమంత్రాల మధ్య దంపతులతో సహా కొత్త ఇంట్లోకి అడుగు పెట్టేందుకు సిద్ధమయ్యారు. రిబ్బన్ కట్ చేద్దామనుకునే సరికి కత్తెర లేకుండా పోయింది. అందరూ ‘కత్తెర… కత్తెర..’ అంటూ అటూ ఇటూ చూడ్డం మొదలు పెట్టారు. దీంతో సీఎం కేసీఆర్ ఆగ్రహానికి గురయ్యారు. వెంటనే తనే చేతితో రిబ్బన్‌ను పీకి పడేశారు. అనంతరం దంపతులతో కలిసి కొత్త ఇంట్లోకి అడుగుపెట్టారు. ఈ సంఘటనతో అధికారులు ఒకింత షాకయ్యారు.
‘చెలి’ శీర్షికల కోసం : https://www.vaartha.com/specials/women/