సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నందమూరి బాలకృష్ణ

తెలంగాణ సీఎం గా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి ని వరుసగా సినీ ప్రముఖులు కలుస్తూ అభినందనలు తెలియజేస్తున్నారు. ఇప్పటికే మెగా స్టార్ చిరంజీవి కలిసి శుభాకాంక్షలు తెలుపగా..ఈరోజు శనివారం ఉదయం అక్కినేని నాగార్జున దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు.

ఇక కొద్దీ సేపటిక్రితం ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు విరివిరిగా కలిశారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. వారితో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పీవీ సింధు తల్లిదండ్రులు, ఇతరులు ఉన్నారు. మరోవైపు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, పలువురు సీపీఎం నేతలు కూడా మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.