మరోసారి ఢిల్లీకి వెళ్ళబోతున్న సీఎం జగన్

ఈ నెల 16 నే ఢిల్లీ కి వెళ్లిన సీఎం జగన్..మరోసారి ఢిల్లీకి బయలుదేరబోతున్నారు. రేపు సాయంత్రం జగన్ ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలుస్తుంది. నెలలో రెండోసారి ఢిల్లీ కి వెళ్లడం వెనుక కథ ఏంటి అని అంత అరా తీస్తున్నారు. నేడు అమరావతిపై సుప్రీం కోర్టు లో విచారణ జరుగనుంది. అమరావతిపై హైకోర్టు తీర్పుపై స్టే విధించాలంటూ సుప్రీంలో పిటీషన్ దాఖలు చేసింది ఏపీ ప్రభుత్వం. హైకోర్టు తీర్పును యధాతధంగా అమలు చేసేలా ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలంటూ సుప్రీంను ఆశ్రయించారు అమరావతి రైతులు. ఈ తరుణంలో తీర్పు ఏమొస్తుందా అని అంత ఉత్కంఠ గా ఎదురుచూస్తున్న తరుణంలో జగన్ ఢిల్లీకి వెళ్ళబోతున్నారనేది ఆసక్తి గా మారింది.

ఈ నెల 16 న జగన్ ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రధాని మోడీ , కేంద్ర మంత్రి అమిత్ షా లతో భేటీ అయ్యారు. స్వయం శక్తి దిశగా రాష్ట్రం అడుగులేసేందుకు తోడ్పడుతుంద‌ని సీఎం జగన్ ప్ర‌ధాని దృష్టికి తెచ్చారు. అరగంటకు పైగా సాగిన సమావేశంలో ప్రధానంగా 14 అంశాలను జగన్ ప్రస్తావించారు. అలాగే పార్లమెంటులోని హోం మంత్రి కార్యాలయంలో కేంద్ర మంత్రి అమిత్ షా సమావేశమైన సీఎం.. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఈ మేరకు సీఎం విన‌తి పత్రం అందించడం జరిగింది. మరి ఇప్పుడు ఎందుకు ఢిల్లీకి జగన్ వెళ్తున్నారనేది తెలియాల్సి ఉంది.