వలస కార్మికులతో శ్రీకాకుళంకు శ్రామిక్‌ రైలు

వీరిలో 635 మంది మత్స్యకారులు

migrant workers

శ్రీకాకుళం: తమిళనాడు నుండి 889 మంది వలస కార్మికులతో శ్రామిక్‌ రైలు ఈరోజు ఉదయం శ్రీకాకుళం చేరుకుంది. రైలులో జిల్లాకు చేరుకున్న వారందరూ పది నెలల క్రితం చెన్నై వలస వెళ్లారు. వీరిలో 635 మంది మత్స్యకారులు ఉన్నారు. వీరిలో విజయనగరం జిల్లాకు చెందిన 35 మంది ఉండడంతో వారిని రెండు బస్సుల్లో విజయనగరం తరలించారు. మిగతా వారిని సరుబుజ్జలి వెన్నెల వలస నవోదయ, శ్రీకాకుళం డెంటల్ కాలేజీ, చిలకపాలెం శివానీలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. కాగా 17 బోగీల్లో శ్రీకాకుళం చేరుకున్న కార్మికులకు భూసేకరణ ప్రత్యేక డిప్టూఈ కలెక్టర్‌ సాల్మన్‌రాజు స్వాగతం పలికారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/