నేడు ప్రకాశం, విజయవాడ, విశాఖలో సిఎం జగన్‌ పర్యటన

రేపు విశాఖలో జీ20 ప్రతినిధులతో సమావేశం

cm-jagan-comes-to-prakasam-district-today

అమరావతిః సిఎం జగన్‌ ఈరోజు, రేపు ప్రకాశం, విజయవాడ, విశాఖలో పర్యటించనున్నారు. ఈ ఉదయం 10.55 గంటలకు ప్రకాశం జిల్లా కారుమంచి వెళ్లనున్నారు. వైఎస్‌ఆర్‌సిపి నేత అశోక్ బాబు తల్లి కోటమ్మకు నివాళులు అర్పించనున్నారు. సాయంత్రం 5 గంటలకు విజయవాడలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలవనున్నారు.

సీఎం జగన్ రేపు సాయంత్రం 6 గంటలకు విశాఖ వెళ్లనున్నారు. రుషికొండలోని రాడిసన్ బ్లూ రిసార్ట్స్ చేరుకోనున్నారు. రేపు రాత్రి 7 గంటలకు జీ20 ప్రతినిధులతో సమావేశం అవుతారు. జీ20 ప్రతినిధులకు ఏర్పాటు చేసిన విందులో సీఎం పాల్గొంటారు. అనంతరం, రేపు రాత్రి 10 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.