కరోనా కేసులపై నేడు రాష్ట్రాలతో కేంద్రం వీడియో కాన్ఫరెన్స్

ఇప్పటికే కొన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం

New corona virus strain
corona virus

న్యూఢిల్లీః కరోనా మహ్మమారి కేసులు మళ్లీ దేశంలో పెరుగుతున్నాయి. రోజువారీ కొత్త కేసుల సంఖ్య 1000కి పైగా నమోదవుతుండడంతో కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే అత్యధిక సంఖ్యలో కొవిడ్ కేసులు నమోదవుతున్న రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.

ఈ క్రమంలో, నేడు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలతో కేంద్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుంది. ఐదు నెలల తర్వాత ఈ స్థాయిలో పాజిటివ్ కేసుల్లో పెరుగుదల కనిపిస్తుండడం ఇదే ప్రథమం. ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు దిశానిర్దేశం చేయనుంది. కరోనా వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనుంది. కాగా, దేశంలో ప్రస్తుతం వ్యాపిస్తున్న కరోనా వేరియంట్ ను ఎక్స్ బీబీ 1.16గా గుర్తించారు.