సొసైటీకి మంచి సందేశం: ‘భవదీయుడు భగత్ సింగ్’

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మూవీ తో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి చక్కటి విజయం సొంతం చేసుకున్నారు. రీసెంట్ గా భీమ్లా నాయక్ తో మరో కమర్షియల్ హిట్ అందుకొని అభిమానుల్లో జోష్ నింపారు. ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్లో హరిహర వీరమల్లు అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ పూర్తి కాగానే హరీష్ శంకర్ డైరెక్షన్లో భవదీయుడు భగత్ సింగ్ అనే మూవీ చేయనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ మూవీ తెరకెక్కుతుంది.

‘గబ్బర్ సింగ్’ తర్వాత పవన్ – హరీష్ శంకర్ కలయికలో వస్తున్న మూవీ కావడం తో దీనిపై భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే, ఈ సారి పవన్ కల్యాణ్ ను వెరీ డిఫరెంట్ ఇమేజ్ లో హరీష్ ప్రొజెక్ట్ చేయబోతున్నారు. అందుకే ‘దిస్ టైమ్ ఇట్స్ నాట్ జస్ట్ ఎంటర్ టైన్మెంట్’ అనే క్యాప్షన్ ను హరీశ్ శంకర్ పోస్టర్ లో రివీల్ చేశారని అభిమానులు అంటున్నారు. కమర్షియల్ ఫార్ములాతో పాటు సొసైటీకి మంచి సందేశం ఇచ్చేలా సినిమా స్టోరిని హరీశ్ శంకర్ రచించినట్లు టాక్. ఇక ఇందులో హీరోయిన్ గా పూజా హెగ్డేను ఫైనల్ చేశారని తెలుస్తుండగా, ఇందులో ఇంకో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారని వినికిడి.