సర్దార్‌ వల్లాభాయ్‌ పటేల్‌‌కు ప్రధాని నివాళి

PM Shri Narendra Modi flags off Rashtriya Ekta Diwas parade from Statue of Unity in Gujarat

గాంధీనగర్‌: నేడు భారత తొలి ఉప ప్రధాని సర్దార్‌ వల్లాభాయ్‌ పటేల్‌ 145 జయంతి ( ఏక్తా దివస్‌) సందర్భంగా ప్రధాని మోడి గుజరాత్‌లోని నర్మదా నది తీరంలోని కేవాడియా వద్ద ఐక్యతకు చిహ్నంగా నిర్మించిన సర్దార్‌ వల్లాభాయ్‌ పటేల్‌ విగ్రహం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. అనంతరం రాష్ట్రీయ ఏక్తా దివస్‌ పరేడ్‌లో పాల్గొని జాతిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. సర్దార్‌ పటేల్‌ జయంతి సందర్భంగా ఏక్తా దివస్‌ను జరుపుకుంటున్నామని గుర్తుచేశారు. కాగా దేశం కరోనాపై విజయసాధించేందుకు కృషిచేసిన పోలీసులు, వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, పారిశుధ్య కార్మికులు తదితర కరోనా యోధులకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు.

Breaking News LIVE| PM Modi On Sardar Patel's Birth Anniversary, 'Nation  Will Never Forget Those Who Politicised The Sacrifice Of Pulwama Martyrs'


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/