55వేల జనాభా ఉన్న చోట ఎవరైనా సారా కాస్తారా?..కల్తీసారా ఘటనపై సీఎం క్లారిటీ

cm-jagan -clarity-on-liquor-in-ap-assembly

అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. సమావేశంలో భాగంగా సీఎం జగన్‌ ప్రసంగిస్తూ… కల్తీసారా ఘటనపై క్లారిటీ ఇచ్చారు. అక్రమ మద్యాన్ని అరికట్టడానికి ప్రత్యేక వ్యవస్థను తీసుకువచ్చామని, రెండు సంవత్సరాలలో 13వేల కేసులను నమోదు చేశామని వెల్లడించారు. అయితే సాధారణ మరణాలపై తప్పుడు రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తే నమ్మేలా ఉండాలని అన్నారు.

దేశంలో 2 శాతం కల్తీసారా తాగి చనిపోతున్నారని అన్నారు. జంగారెడ్డి గూడెంలో సారా కాయడం సాధ్యపడుతుందా..? అని ప్రశ్నించారు. సారా కాచేవారిపై ఉక్కుపాదం మోపుతున్నామని స్పష్టం చేశారు. గోబెల్స్‌ డెమోక్రసీ అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఒకే అబద్దాన్ని నిజం చేయడానికి విషప్రచారం జరుగుతోందని ఆరోపించారు. జరగని ఘటనను జరిగిందని చూపిస్తున్నారని సభలో మండిపడ్డారు. చంద్రబాబు మాట్లాడేది ఆయనకే అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో టీడీపీ సభ్యులు హుందాగా ప్రవర్తించాలని సీఎం జగన్‌ హితవు పలికారు. 55వేల జనాభా ఉన్న చోట ఎవరైనా సారా కాస్తారా, నిఘా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సారా తయారు చేయడం సాధ్యమా అని ప్రశ్నించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/