నేడు వైయస్ వివేకానంద రెడ్డి మూడో వర్ధంతి

కడప: నేడు మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి మూడో వర్ధంతి. ఈ సందర్బంగా వివేకా సమాధి వద్ద ఆయన కుటుంబసభ్యులు ప్రత్యేక ప్రార్ధనలను నిర్వహించారు. మూడేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు అయన దారుణహత్యకు గురైన విషయం తెలిసిందే. తొలుత అయన గుండాపోటుకు గురై మరణించరణే ప్రచారం జరిగినప్పటికీ… ఆ తర్వాత అయన హత్యకు గురయ్యారని సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ప్రసుతం ఈ హత్య కేసును సీబీఐ విచారించగా, ఈ కేసులో పెద్దపెద్ద పేర్లు కూడా వినిపిస్తున్నాయి.

మరోవైపు వివేకా నేపథ్యంలో అయన భర్య సౌభాగ్యమ్మ కూతురు సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డి పులివెందుల చేరుకున్నారు. వీరితో పటు పలువురు కుటంగాసభ్యులు పులివెందుకు చేరుకొని వివేకా సమాధి వద్ద వీరు ప్రప్రత్యేక ప్రార్ధనలను నిర్వహించి, వివేకానందకు నివాళి అర్పించారు.

తాజా తెలంగాణ వార్త కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/