చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్… సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ సీఐడీ

ఈ నెల 28న జైలులో సరెండర్ కావాల్సిన అవసరం లేదన్న న్యాయమూర్తి

cid-petition-in-supreme-court-challenging-chandrababu-bail

అమరావతి: స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో టిడిపి అధినేత చంద్రబాబుకు హైకోర్టు బెయిల్‌ మంజూరు చేయడంపై ఏపీ సీఐడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బెయిల్‌ మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఏపీ సీఐడీ సుప్రీంలో సవాల్‌ చేస్తూ పిటిషన్‌ దాఖలు చేసింది. ఇప్పటికే చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో తీర్పు పెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే.

సీఐడీ విభాగం చంద్రబాబును స్కిల్ కేసులో అరెస్ట్ చేయడం తెలిసిందే. 50 రోజులకు పైగా రిమాండ్ లో ఉన్న ఆయన ఇటీవల మధ్యంతర బెయిల్ పై బయటికి వచ్చారు. చంద్రబాబు ప్రస్తుతం కంటికి శస్త్రచికిత్స చేయించుకుని హైదరాబాదులోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.

చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై నిన్న వాదనలు విన్న ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించింది. మధ్యంతర బెయిల్ షరతులు ఈ నెల 28 వరకే వర్తిస్తాయని, ఆయన మళ్లీ జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది.