నాగ చైతన్య ‘కస్టడీ’ ట్రైలర్ రిలీజ్

నాగ చైతన్య – కృతి శెట్టి జంటగా వెంకట్ ప్రభు డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీ కస్టడీ. తెలుగు, తమిళ భాషల్లో మే 12వ తేదీన విడుదల కాబోతుంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ సినిమా తాలూకా ట్రైలర్ ను రిలీజ్ చేసి సినిమా ఫై ఆసక్తి పెంచారు. సీఎం సెక్యూరిటీగా వెళ్లిన కానిస్టేబుల్ ఏకంగా ఆ సీఎంనే ఆపడం నుండి సినిమా మలుపు తిరగడం మొదలవుతుంది. ఇందులో ఒకప్పటి టాలీవుడ్ టాప్ హీరోయిన్ ప్రియమణి సీఎం పాత్రలో కనిపిస్తోంది. కేవలం 48 గంటల్లో ఒక విలన్ కు పోలీసు డిపార్ట్మెంట్ కు మధ్య ఆ విలన్ చావకుండా కాపాడటమే ఈ మూవీ నేపథ్యం. ట్రైలర్ ద్వారా మూవీ ఇంటెన్సిటీ అర్థమవుతోంది.

విలన్ కు వచ్చే ఆపదలను అడ్డుకుంటూ రక్షించడమే హీరో మిషన్ గా కథ సాగుతుంది. కథ లో విభిన్నమైన పాయింట్ ఇదే. ఇప్పటి వరకు తెలుగు లో నిజంగా ఇలాంటి పాయింట్ తో సినిమా రాలేదు. సినిమా లో ఆసక్తికర విషయాన్ని చిత్ర యూనిట్ ట్రైలర్ ద్వారా చెప్పుకొచ్చింది. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో శరత్ కుమార్ ఒక కీలకమైన పాత్రను పోషించాడు. ‘బంగార్రాజు’ తరువాత చైతూ – కృతి శెట్టి కలిసి నటిస్తున్న సినిమా ఇది. దీంతో ఈ మూవీ ఫై అందరిలో ఆసక్తి పెరుగుతుంది. ఇక ఈ మూవీ ఈ ఇద్దరికీ చాల కీలకంగా మారింది. వీరిద్దరూ ప్రస్తుతం వరుస ప్లాప్స్ లో ఉన్నారు. దీంతో ఈ మూవీ ఫైనే వారితో పాటు , అభిమానులు ఆశలు పెట్టుకుని ఉన్నారు. చిట్టూరి శ్రీనివాస్ ఈ మూవీ ని నిర్మిస్తున్నారు.

YouTube video