పవన్ కళ్యాణ్ ను తిడుతున్నప్పుడల్లా చిరంజీవికి ఎంతో బాధేస్తుందట..

రాజకీయాల్లో రాణించాలంటే అంత ఈజీ కాదు మాట అనాలి..మాట పడాలి అప్పుడే రాణించగలరు. అయితే ఇలా చేయడం లో చిరంజీవి విఫలమయ్యారు. అందుకే త్వరగా రాజకీయాల్లో నుండి బయటకు వచ్చి మళ్లీ సినిమాలతో బిజీ అయ్యారు. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ గా ఉన్నాడు. ఓ పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క రాజకీయాల్లో బిజీ గా ఉన్నారు. ప్రస్తుతం ఏపీలో అధికార పార్టీ టార్గెట్ పవన్ కల్యాణే. గతంలో టిడిపి ప్రత్యర్థి గా ఉన్నప్పటికీ..ఇప్పుడు జనాల్లో టిడిపి కంటే జనసేన పైనే నమ్మకం పెరిగింది. ఇప్పటికే ఇద్దరికీ ఛాన్స్ ఇచ్చాం..ఈసారి పవన్ కళ్యాణ్ కు ఛాన్స్ ఇచ్చి చూద్దాం అన్న రీతిలో ప్రజలు ఉన్నారు. అందుకే అధికార వైస్సార్సీపీ పార్టీ పవన్ కళ్యాణ్ ను టార్గెట్ గా చేసుకుంది.

పవన్ కళ్యాణ్ ఏ పనిచేసిన..ఏంచేసినా దానిని వ్యతిరేకిస్తూ బూతులు మాట్లాడుతున్నారు. ఇలా మాట్లాడినప్పుడల్లా అభిమానుల్లేకాదు ఫ్యామిలీ సభ్యుల్లోనూ ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటుంది. అలాగే బాధ కూడా వేస్తుంది. పనికిరాని వాళ్లతో మాట పడాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ కు ఎందుకు అన్నట్లు వారంతా మాట్లాడుకున్తున్నారు. తాజాగా ఇదే విషయాన్నీ చిరంజీవి ఓ మీడియా కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో తెలిపారు.

తమ్ముడైన సరే పవన్‌ని కొడుకులా చూసుకున్నామని అన్నారు. సమాజానికి ఏదైనా చేయాలనే తపనతో పవన్ అన్నీ వదిలేసిన యోగిలాంటి వాడని చిరంజీవి అభివర్ణించారు. ఇక పవన్‌ను రాజకీయాల్లో కొందరు మితిమీరి మాటలు అంటున్నప్పుడు బాధ కలుగుతుందని, పవన్‌ను తిట్టినవాళ్ల తన వద్దకు వచ్చి పెళ్లిళ్లకు..పేరంటాలకు పిలుస్తారని..రమ్మని బ్రతిమలాడతారని చెప్పుకొచ్చారు. తన తమ్ముడిని అన్ని మాటలు అన్నవాళ్లతో మాట్లాడాల్సి వస్తుంది..కలవాల్సి వస్తుందనే బాధ ఉంటుందని చిరంజీవి తన మనసులో మాట చెప్పుకొచ్చారు.