పెళ్లి బృందానికి ప్రమాదం తీవ్రంగా కలచివేసింది: పవన్

అమరావతి : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పెళ్లి బృందానికి ప్రమాదం పై స్పందించారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటన తీవ్రంగా కలచివేసిందన్నారు. బళ్లారిలో బిడ్డకు కన్యాదానం చేసి స్వగ్రామానికి కారులో వెళుతున్న బీజేపీ నాయకులు కోకా వెంకటప్పనాయుడుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం దురదృష్టకరమని పవన్ పేర్కొన్నారు. ఒకే కుటుంబంలోని ఐదుగురు మరణించడం మరింత బాధాకరమన్నారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తూ మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని పవన్ ప్రకటించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/