నేడు పీలేరు, ఉరవకొండ సభల్లో పాల్గొననున్న చంద్రబాబు

chandrababu

అమరావతిః ఏపీలో ప్రధాన పార్టీల నేతల వరుస సభలు, కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. టిడిపి అధినేత చంద్రబాబు ‘రా.. కదలిరా’ పేరుతో బహింరంగ సభలను నిర్వహిస్తున్నారు. ఈనేపథ్యంలోనే ఆయన నేడు చిత్తూరు జిల్లా పీలేరు, అనంతపురం జిల్లా ఉరవకొండలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరిన ఆయన 11.15 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి 11.50 గంటలకు హెలికాప్టర్ లో పీలేరుకు చేరుకుని బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు ఉరవకొండకు చేరుకుని అక్కడి సభలో ప్రసంగిస్తారు. అనంతరం తిరుగుపయనమవుతారు.