పోషకాలతోనే పిల్లల ఎదుగుదల

చిన్నారుల ఆరోగ్యం, సంరక్షణ

Child growth with nutrients
Child growth with nutrients

విటమిన్ సి:

వర్ణ మయమైన బెల్ పెప్పర్స్, క్యాలీఫ్లవర్, బ్రొకోలీ వంటి తాజా కూరగాయలు, నారింజయా, బత్తాయి, పైన్ ఆపిల్ , జామ, స్ట్రా బెర్రీ, బొప్పాయిని రోజూ ఆహారంలో ఉండేలా చూడాలి.. వీటిలో పుష్కలంగా వుండే విటమిన్ -సి పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తిని ఇనుమడింప జేస్తాయి.. వారి జ్ఞాపక శక్తిని పెంచుతుంది.. ఐరన్ లోపాన్ని సరిచేస్తుంది.. పండ్ల లోనే పీచు జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది..

విటమిన్ ఇ :

విటమిన్ ఇ లోని యాంటీ ఆక్సీడెంట్స్ నరాల వ్యవస్థను బలోపేతం చేస్తుంది.. కణ విభజనలో ప్రధాన పాత్రలో ఇది ఎక్కువగా తీసుకుంటుంది.. వెజిటబుల్ ఆయిల్స్, గింజ ధాన్యాలు, విత్తనాలు , ఆకు కూరలతో పాటు ఆకుపచ్చగా వుండే కూరగాయలన్నిటిలో పిల్లల ఆహారంలో భాగం చేయాలి..

వీటిలోని విటమిన్ ఇ వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.. విటమిన్ కే 2 ఎముకులకు క్యాల్షియం అందేలా చేస్తుంది.. పులియబెట్టిన పెరుగు వంటి ఆహారం తో పాటు గుడ్డు, మాంసాహారం ద్వారా కే 2 విటమిన్ పిల్లల ఎముకులను బలోపేతం చేస్తుంది..

జింక్, ఐరన్:

కండరాలు బలోపేతంగా ఉండాలంటే జింక్, ఐరన్ వుండే ఆహారాలను అందించాలి.. ముదురాకు పచ్చ ఆకు కూరలు, కూరగాయలతోపాటు గుమ్మడి విత్తనాలు, గుడ్లు, మాంసాహారం ద్వారా జీవ క్రియలను సక్రమంగా జరిగేలా చేయొచ్చు.. బాల్యం నుంచుజి పోషక విలువలున్న ఆహారం అందితేనే పిల్లల ఎదుగుదల బాగా జరుగుతుంది.

‘స్వస్థ’ (ఆరోగ్య సంబందిత విషయాలు ) కోసం: https://www.vaartha.com/specials/health/