కంటి నిండా నిద్ర పట్టాలంటే..

ఆరోగ్య చిట్కాలు

sleep completely
sleep completely

నిద్ర లేకపోతే రక రకాల అనారోగ్య సమస్యలు వచ్చిపడతాయి. అందుకే కంటినిండా నిద్ర పోవాలని నిపుణులు సూచిస్తుంటారు.
ప్రతి రోజూ ఒకే సమయానికి పడుకోవటం అలవాటు చేసుకోవాలి. పగటి పూట నిద్ర పోకూడదు.. ఒకవేళ ఆ అలవాటు ఉంటే మానుకోవటం మంచిది..ఎందుకంటే మధ్యాహ్నం నిద్ర పోవటం వలన రాత్రి నిద్ర ఆలస్యంగా పడుతుంది. దాంతో రోజువారీ టైం టేబుల్ తప్పి నిద్రలేమితో రక రకాల ఇబందులు తలెత్తుతాయి. రాత్రి సమయంలో కాఫీ, టీ లు మానేయాలి.. ఇవి తాగితే తొందరగా నిద్ర పట్టదు. పడుకోబోయే ముందు గోరు వెచ్చటి పాలు తాగితే త్వరగా నిద్ర వస్తుంది..

పడుకునే ముందు ఇతర పనులు గురుంచి ఆలోచించకూడదు.. దానివల్ల నిద్ర పట్టక ఉదయాన సమయానికి లేవలేరు . పనులు కూడా ఓపిగ్గా , హుషారుగా చేసుకోలేరు.. పడుకునే ముందు మనసుకు నచ్చిన విషయాలు ఆలోచించుకుంటే పీడ కలలు రావు. నిద్రా భంగం కాదు. నచ్చిన పాటలు వినటం, నచ్చిన పుస్తకాలు చదవటం వలన రాత్రి ప్రశాంతంగా నిద్ర పడుతుంది..

‘చెలి’ (మహిళల ప్రత్యేకం) వ్యాసాల కోసం: https://www.vaartha.com/specials/women/