గుజరాత్‌లోని వడోదరలో యువశివిర్‌లో ప్రసంగించిన ప్రధాని

YouTube video
PM Modi addresses Yuva Shivir in Vadodara, Gujarat | PMO

న్యూఢిల్లీ : గుజరాత్​లోని వడోదరాలో నిర్వహించిన యువ శిబిర్​ కార్యక్రమంలో భాగంగా కుందాల్​ధామ్, కరేయ్​బాగ్​ ప్రాంతాల్లోని శ్రీస్వామినారాయణ్​ దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ప్రధాని మోడీ వర్చువల్​గా హాజరయ్యారు. ఈసందర్బంగా ఆయన మాట్లడుతూ..పురాతన సంస్కృతిని, ఆధునిక ఆలోచనలను జోడించి నవభారత్​ను నిర్మించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ‘ఏ సమాజానికి అయినా పునాది, అభివృద్ధి అందులో ఉండే యువతపైనే ఆధారపడి ఉంటుందని మన పూర్వికులు నేర్పించారు’ అని ప్రధాని పేర్కొన్నారు.

అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో ప్రపంచ శాంతిని నెలకొల్పే సామర్థ్యం గల దేశంగా భారత్​ను తీర్చిదిద్దాలని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ‘కరోనా ఉద్ధృతి సమయంలో ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్లు, మందులు పంపిణీ చేసిన దగ్గర నుంచి అంతర్జాతీయంగా అస్థిరత ఏర్పడినా శాంతియుత దేశంగా భారత్​ నిలిచింది. ప్రపంచానికి భారత్​ ఇప్పుడు కొత్త ఆశాకిరణం’ అని మోడీ పేర్కొన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/