నితిన్ గడ్క‌రీకి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపిన చంద్ర‌బాబు

గ‌డ్క‌రీతో తాను క‌లిసి ఉన్న ఫొటోను యాడ్ చేసిన టీడీపీ చీఫ్‌

అమరావతి: టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు బీజేపీ సీనియ‌ర్ నేత‌, కేంద్ర ర‌వాణా శాఖ మంత్రి నితిన్ గడ్క‌రీకి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ మేర‌కు గ‌డ్క‌రీ జ‌న్మ‌దినాన్ని గుర్తు చేసుకున్న చంద్ర‌బాబు ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆయ‌న‌కు బ‌ర్త్ డే విషెస్ తెలిపారు. గ‌తంలో తాను సీఎంగా ఉండ‌గా…ఏపీ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన గ‌డ్క‌రీతో ఓ వేదిక మీద క‌లిసి కూర్చున్న ఫొటోను చంద్ర‌బాబు త‌న ట్వీట్‌కు జ‌త చేశారు. ప్ర‌జ‌ల‌కు మ‌రింత సేవ చేసేందుకు గ‌డ్క‌రీకి మ‌రింత మేర అవ‌కాశం ఇవ్వాల‌ని ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు ఆకాంక్షించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/