రఘురామకృష్ణం రాజు సీటు మార్చిన వైఎస్‌ఆర్‌సిపి
ఉత్తర్వులు జారీ చేసిన లోక్ సభ సెక్రటేరియట్

అమరావతి: నర్సాపురం ఎంపి రఘురామకృష్ణరాజుకు వైఎస్‌ఆర్‌సిపి ఝలక్ ఇచ్చింది. లోక్‌సభలో ఆయన కూర్చునే సీటును వెనక్కి మార్చింది. గతంలో నాల్గో లైన్‌లో ఉన్న సీటును ఏడో లైన్‌లోకి మారుస్తూ లోక్‌సభ అధికారులు తాజాగా ఉత్తర్వులు జారీ జారీ చేశారు. వైఎస్‌ఆర్‌సిపి లోక్ సభ పక్షనేత సూచన మేరకు ఈ మార్పులు చేసినట్టు అధికారులు తెలిపారు. రఘురామకృష్ణరాజు సీటును మార్గాని భరత్ కు కేటాయించారు. రఘురాజును 376 నంబర్ సీటు నుంచి 445 సీటుకు మార్చారు. భరత్ ను సీట్ నంబర్ 385 నుంచి 379కి మార్చారు. కోటగిరి శ్రీధర్ ను 421 నుంచి 385కి మార్చారు. బెల్లన చంద్రశేఖర్ సీటును 445 నుంచి 421కి మార్చారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/