కేసీఆర్ మీడియా సమావేశంపై రేవంత్ ఫైర్

ఆదివారం టిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ దాదాపు రెండున్నర గంటల సేపు మీడియా సమావేశం ఏర్పటు చేసి మోడీ ఫై నిప్పులు చెరిగారు. దీనిపై బిజెపి నేతలు కౌంటర్ ఎటాక్ చేస్తూ వస్తున్నారు. ఈ తరుణంలో కేసీఆర్ స్పీచ్ ఫై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. చంద్రమండలంలోనూ ప్రజాస్వామ్య పరిరక్షకుడిగా నిలవాలన్నంత తాపత్రయం కేసీఆర్ లో కనిపించిందని రేవంత్ అన్నారు.

కేసీఆర్ మాట్లాడింది బాగానే ఉంది కానీ, మాట్లాడిన అంశాలతో ఆయనకేంటి సంబంధం అని అడుగుతున్నాం. మోడీ వివిధ పార్టీలను ఆక్రమిస్తూ, ప్రభుత్వాలను కూలగొడుతూ దురాక్రమణదారుగా కొనసాగుతున్నాడని నువ్వు చెప్పింది నిజమే. కానీ ఆయనకు ఆదర్శపురుషుడివి నువ్వే కదా… ఆయన కులగురువు నువ్వే కదా. ఇట్లాంటి క్రూరమైన, నేరమయ ఆలోచనలకు మోడీ నువ్వే ఆదర్శం కదా.

ఇతర పార్టీల ఎమ్మెల్యేలను లాగేసుకున్నప్పుడు ఈ ఆక్రమణలు గుర్తుకు రాలేదా? తెలంగాణ ఏర్పడిన తర్వాత సబితా, ఎర్రబెల్లి వంటి ఏక్ నాథ్ షిండేలను తయారుచేసింది ఎవరు? విపక్షంలో గెలిచిన తలసాని శ్రీనివాస్ ను టీఆర్ఎస్ లోకి పిలిచి మంత్రి పదవి ఇచ్చింది ఎవరు?” అంటూ నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్ లో ఉన్నవాళ్లంతా ఇతర పార్టీల నేతలే అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వంద ఎలుకలు తిన్న పిల్లి నీతి వాఖ్యలు చెప్పినట్లు.. కేసీఆర్ వంద తప్పులు చేసి ఇప్పుడు నీతి వాఖ్యలు వల్లిస్తున్నారు. ఈ దేశంలో సాగు ,తాగునీరు అందించింది కాంగ్రెస్ పార్టీ. చైనా కంటే అద్భుతమైన ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్. కాంగ్రెస్‎తో పోల్చే స్థాయి నరేంద్రమోదీకి లేదు. పార్లమెంట్‎లో బీజేపీ బిల్లులకు మద్దతు ఇచ్చింది టీఆర్ఎస్ కాదా?. బీజేపీ తప్పిదాల్లో టీఆర్ఎస్ పాత్ర ఉంది. మోడీ దోపిడీలో కేసీఆర్ వాటా ఏంతో తేల్చాలి.’’ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.