ఘోర అగ్నిప్ర‌మాదం..11 మంది శిశువులు స‌జీవ‌ద‌హ‌నం

సెనెగ‌ల్: ప‌శ్చిమ ఆఫ్రికాలోని సెనెగ‌ల్ దేశంలో ఘోర అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. ఓ ఆస్ప‌త్రిలోని చిన్న‌పిల్ల‌ల వార్డులో ఆక‌స్మాత్తుగా మంట‌లు చెల‌రేగాయి. దీంతో 11 మంది న‌వ‌జాత శిశువులు స‌జీవ‌ద‌హ‌నం చెందారు. మ‌రో ముగ్గురు శిశువులను ప్రాణాల‌తో ర‌క్షించారు. 11 మంది శిశువులు మృతి చెంద‌డంతో ఆ దేశ అధ్య‌క్షుడు మాకీ తీవ్ర దిగ్ర్భాంతి వ్య‌క్తం చేశారు. మూడు రోజుల పాటు సంతాప దినాలు ప్ర‌క‌టించారు. శిశువుల కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు.

కాగా, తివోయానేలోని అబ్దుల్ అజిజ్ సై ద‌బాఖ్ హాస్పిట‌ల్‌లోని చిన్న పిల్ల‌ల వార్డులో ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. దీంతో ద‌ట్ట‌మైన పొగ‌లు క‌మ్ముకోవ‌డంతో ఊపిరాడ‌క పిల్ల‌లు మృతి చెందారు. శిశువులు మృతి చెంద‌డంతో వారి త‌ల్లిదండ్రులు షాక్‌లోకి వెళ్లారు. ఎల‌క్ట్రిక్ షాక్ కార‌ణంగానే అగ్నిప్ర‌మాదం సంభ‌వించిన‌ట్లు ఆస్ప‌త్రి వ‌ర్గాలు ప్రాథ‌మికంగా నిర్ధారించాయి. ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌పై పూర్తి స్థాయి విచార‌ణ చేప‌ట్టాల‌ని ఇంటీరియ‌ర్ మినిస్ట‌ర్ ఆంటోనీ డైమో ఆదేశించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/