అచ్చెన్నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు : చంద్రబాబు

అమరావతి : టీడీపీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు బ‌ర్త్ డే ఈరోజు. ఈసంద‌ర్భంగా ఆయ‌న‌కు పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అచ్చెన్నాయుడుకు చంద్రబాబు ఫోన్ చేసి బర్త్‌డే విషెస్ చెప్పారు. ‘‘నాడు ఎర్రన్న ….నేడు అచ్చెన్న… ఇద్దరూ నాకు అత్యంత ఆప్తులు. అన్నకు తగ్గ తమ్ముడిగా… నాకు కుడిభుజంగా ఉంటూ పార్టీకి, ప్రజలకు సేవలందిస్తున్న సోదరుడు అచ్చెన్నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు’’ అని చంద్రబాబు అన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/