మ‌రో 3 నెల‌లు ఉచిత రేష‌న్ పొడిగింపు : సీఎం యోగి

లక్నో : ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఉచిత రేష‌న్ స్కీమ్‌ను మ‌రో మూడు నెల‌లు పొడిగించారు. యోగి నేతృత్వంలోని క్యాబినెట్ ఈ నిర్ణ‌యాన్ని తీసుకున్న‌ది. పేద‌ల‌ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని, కేంద్ర‌-రాష్ట్ర ప్ర‌భుత్వాల ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు అందాల‌న్న‌ది త‌మ ఉద్దేశ‌మ‌ని డిప్యూటీ సీఎం బ్రిజేశ్ పాఠక్ తెలిపారు. క‌రోనా స‌మ‌యంలో పేద ప్ర‌జ‌ల‌కు ఉచిత రేష‌న్ స్కీమ్‌ను కొన‌సాగించిన విష‌యం తెలిసిందే. యోగి విజ‌యంలో ఈ స్కీమ్ కీల‌క పాత్ర పోషించింది. వ‌రుస‌గా రెండ‌వ‌సారి యూపీ సీఎంగా యోగి నిన్న ప్ర‌మాణ స్వీకారం చేశారు. యోగితో పాటు 52 మంది మంత్రులుగా ప్ర‌మాణం చేశారు. కేశ‌వ ప్ర‌సాద్ మౌర్య .. డిప్యూటీ సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/