వైఎస్ జగన్ యాత్ర నేటి షెడ్యూల్

ఏపీ సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ యాత్ర 6వ రోజుకు చేరింది. ఈరోజు ఉదయం 9 గంటలకు చీకటిమానిపల్లె నుంచి బస్సుయాత్ర ప్రారంభం కానుంది. గొల్లపల్లి మీదుగా జగన్ అంగళ్లు గ్రామం చేరుకుంటారు.

మధ్యాహ్నం 3.30గంటలకు మదనపల్లెలో బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం నిమ్మనపల్లి, బోయకొండ క్రాస్, చౌడేపల్లి, సోమల మీదుగా అమ్మగారిపల్లెకు చేరుకుంటారు. రాత్రికి అమ్మగారిపల్లె శివారులో బస చేయనున్నారు.