పార్టీకి దూరంగా లేను, దగ్గరగా లేను అంటున్న రాపాక

MLA Rapaka vara prasada rao
MLA Rapaka vara prasada rao

తిరుమల: జనసేన ఏకైక ఎమ్మెల్యె రాపాక వరప్రసాద్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను జనసేన ఎమ్మెల్యేగానే ఉన్నానని రాపాక వరప్రసాద్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఉదయం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకుని, అనంతరం మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ను తాను ఈ మధ్య కాలంలో కలవలేదని తెలిపారు. తాను తమ పార్టీకి దూరంగా లేనని, అలాగే దగ్గరగా లేనని రాపాక వ్యాఖ్యానించారు. ప్రభుత్వ విధానాలు నచ్చితే మద్దతు తెలుపుతానని తాను ముందే చెప్పానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న అభివృద్ధి వికేంద్రీకరణ నిర్ణయానికి మద్దతు తెలుపుతున్నానని చెప్పారు. విశాఖ రాజధానిగా ఉంటే గోదావరి ప్రాంతాల్లో వెనుకబడిన ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందుతాయని చెప్పుకొచ్చారు. కాగా, ఏపీ ముఖ్యమంత్రి జగన్‌తో రాపాక క్లోజ్‌గా ఉన్నట్లు చాలాసార్లు బయటపడిన విషయం తెలిసిందే. జనసేన పార్టీ వ్యవహారాలకు మాత్రం దూరంగా ఉంటున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/