ఈ ప్రభుత్వం వచ్చాక సంక్షేమ పథకాలన్నీ రద్దయ్యాయి

జగనన్న వసతి దీవెన కాదు..వంచన దీవెన

chandrababu naidu
chandrababu naidu

రామకుప్పం: మనం చేసేది ధర్మపోరాటం కేసుల గురించి భయపడాల్సిన అవసరం లేదని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి జె-ట్యాక్స్‌ కోసం రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని చంద్రబాబు నాయుడు విమర్శించారు. ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ఆయన చితూరు జిల్లా రామకుప్పం మండలం గోవిందుపల్లెలో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం వచ్చాక సంక్షేమ పథాకాలన్నీ రద్దయ్యాయి. ఎవరైనా పథకాల పేర్లు మార్చుకుంటారు కానీ రద్దు చేస్తారా? అని ప్రశ్నించారు. జగనన్న వసతి దీవెన కాదు..అది వంచన దీవెన అని దుయ్యబట్టారు. రాయలసీమ అభివృద్ధికి మేం చేపట్టిన ప్రాజెక్టులను ఆపేశారని అన్నారు. నదుల అనుసంధానం చేశాను..పులివెందులకు నీళ్లిచ్చాను. వైఎస్‌ఆర్‌సిపికి చిత్తశుద్ధి ఉంటే కుప్పంకు కూడా నీరివ్వాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/